షటిల్‌లో ఒంగోలు క్రీడాకారుల సత్తా

ABN , First Publish Date - 2020-12-20T05:03:48+05:30 IST

క్రిస్మస్‌ను పురష్క రించుకొని పట్టణంలో నిర్వహించిన జిల్లా స్థాయి షటిల్‌ పోటీల్లో ఒంగోలుకు చెందిన ఖాదర్‌ మస్తాన్‌, పవన్‌ సత్తాచాటారు.

షటిల్‌లో ఒంగోలు క్రీడాకారుల సత్తామార్కాపురం (వన్‌టౌన్‌), డిసెంబరు 19 : క్రిస్మస్‌ను పురష్క రించుకొని పట్టణంలో నిర్వహించిన జిల్లా స్థాయి షటిల్‌ పోటీల్లో ఒంగోలుకు చెందిన ఖాదర్‌ మస్తాన్‌, పవన్‌ సత్తాచాటారు. డబు ల్స్‌ విభాగంలో విజయం సాధించారు. పొదిలికి చెందిన రెహమాన్‌, రాజు రన్నర్స్‌గా నిలిచారు. కందుకూరుకు చెందిన శ్రీనాథ్‌, వెంకటే శ్వర్లు తృతీయ, మార్కాపురంనకు చెందిన జోబ్‌, మార్క్‌లు చతుర్థ స్థానాలు సాధించారు. విజేతలకు వరుసగా రూ. 15వేలు, రూ. 10 వేలు, రూ. 7వేలు, రూ. 5వేల నగదును నిర్వాహకులు బహుమతిగా అందజేశారు. 

Read more