ఏడోరోజూ.. నిశ్శబ్దం

ABN , First Publish Date - 2020-03-30T10:09:35+05:30 IST

జిల్లావ్యాప్తంగా నిశ్శబ్ద వాతావరణం కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ ఏడోరోజైన ఆదివారం కూడా ప్రశాంతంగా జరిగింది. ఉదయం పూట సడలింపు సమయంలో జన సంచారం పలు ప్రాంతాల్లో అధికంగా కనిపించింది. ప్రధానంగా

ఏడోరోజూ.. నిశ్శబ్దం

కొనసాగిన లాక్‌డౌన్‌

కూరగాయలు, సరుకుల దుకాణాల వద్ద రద్దీ

పలుచోట్ల కనిపించని సామాజిక దూరం

ఒంగోలులో పర్యటించిన  మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట

దాతల సహాయ కార్యక్రమాలు ముమ్మరం


 ఒంగోలు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా నిశ్శబ్ద వాతావరణం కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ ఏడోరోజైన ఆదివారం కూడా ప్రశాంతంగా జరిగింది. ఉదయం పూట సడలింపు సమయంలో జన సంచారం పలు ప్రాంతాల్లో అధికంగా కనిపించింది. ప్రధానంగా కూరగాయాల దుకా ణాలు, ఆదివారం కావడంతో చికెన్‌, మటన్‌ దుకాణాల వద్ద జనం గుంపులు, గుంపులుగా చేరారు. అలాగే ప్రధా న వీధుల్లోనూ జన సంచారం ఒకింత ఎక్కువగానే కని పించింది. సామాజికదూరం  అత్యధిక ప్రాంతాల్లో కని పించలేదు. 


కూరగాయల విక్రయాలను పరిశీలించిన మంత్రి 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులు, ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదివారం ఒంగోలులో పరిశీలించారు. స్థానిక పీవీఆర్‌ స్కూలు గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కూరగాయాల విక్రయాలను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి మంత్రి బాలినేని పరిశీలించారు. అనంతరం గొడుగుపా లెంలో రేషన్‌ పంపిణీ చేశారు. మరోవైపు కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇక్కట్లు పడుతున్న పలువర్గాల ప్రజలకు దాతలు ముందుకు వచ్చి సహాయక కార్యక్రమా లు చేపడుతున్నారు. ఒంగోలుతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ రూపాలలో దాతలు సహాయక కార్య క్రమాలలో పాలు పంచుకుంటున్నారు. 

Updated Date - 2020-03-30T10:09:35+05:30 IST