కూకట్లపల్లిలో పెట్రోల్‌తో దాడి : యువకుడికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2020-03-13T10:59:42+05:30 IST

కూకట్లపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి పెట్రోల్‌తో దాడిజరిగింది. ఈ సంఘటనలో అదే గ్రామా నికి చెందిన పాలపర్తి దుర్గయ్యపై

కూకట్లపల్లిలో పెట్రోల్‌తో దాడి : యువకుడికి తీవ్ర గాయాలు

బల్లికురవ, మార్చి 12 : కూకట్లపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి పెట్రోల్‌తో దాడిజరిగింది. ఈ సంఘటనలో అదే గ్రామా నికి చెందిన పాలపర్తి దుర్గయ్యపై  తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని సమీప బంధువులు వైద్యచికిత్సలకోసం ఒంగోలు రిమ్స్‌కు తరలిం చారు. వివరాలు ఇలాఉన్నాయి. ఎర్రకొండ వైపు వెళ్తున్న దుర్గయ్యపై అక్కడేఉన్న గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పెట్రోల్‌పోసి నిప్పు అంటించారు. అంతటితో ఆగకుండా అతడివద్ద ఉన్నరూ.20వేల నగదు, సెల్‌ఫోన్‌, బైకును స్వాధీనం చేసుకొని పరారయ్యారు. గురువారం ఉదయం పొలాల వైపు వెళ్తున్న రైతులు దుర్గయ్య పరిస్థితిని గమనించారు. ఆయన బంధువులకు సమాచారం అందిం చారు. ఈ మేరకు వారంతా సంఘటనా స్థలానికి చేరుకొని అతడిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. 


అయితే దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. రాత్రిపూట దుర్గయ్య అటువైపు ఎందుకు వెళ్లినట్టు? అసలు అతడిపై దాడి ఎందుకు జరిగింది?  చేసింది ఎవరు? అక్కడ మహిళ ఎవరైనా ఉన్నారా అన్న సందేహాలు స్థానికుల్లో నెలకొంది. ఈ సంఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారని దుర్గయ్య ఒంగోలు రిమ్స్‌లో స్టేట్‌మెంట్‌  ఇచ్చినట్టు తెలిసింది.

Updated Date - 2020-03-13T10:59:42+05:30 IST