రాత్రి సమయంలో బయటకు వచ్చిన వివాహితను.. ఆరుగురు వ్యక్తులు తీసుకెళ్లి..

ABN , First Publish Date - 2020-09-24T17:24:35+05:30 IST

వితంతు మహిళను నిర్బంధించి అత్యాచారానికి..

రాత్రి సమయంలో బయటకు వచ్చిన వివాహితను.. ఆరుగురు వ్యక్తులు తీసుకెళ్లి..

అద్దంకి(ప్రకాశం): వితంతు మహిళను నిర్బంధించి అత్యాచారానికి పాల్పడిన సంఘటనపై సంతమాగులూరు పోలీ్‌సస్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు సంతమాగులూరు మండలం కొప్పరం పంచాయతీ పరిధిలోని నెహ్రూనగర్‌ కాలనీలో వితంతు మహిళ తన ఇద్దరు పిల్లలతో కలసి జీవిస్తోంది. ఈ నెల 21వ తేదీ రాత్రి ఆ మహిళ మూత్ర విసర్జనకు ఆరుబయటకు వచ్చింది. ఆ సమయంలో ఆరుగురు వ్యక్తులు వచ్చి ఆమెను బలవంతంగా తీసుకు వెళ్లి నిర్బంధించారు. వారిలో శివ అనే వ్యక్తి ఆమెపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు రిమ్స్‌లో వైద్యం కోసం చేరగా అక్కడ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై నసీబ్‌ బాషా బుధవారం కేసు నమోదు చేశారు. అద్దంకి సీఐ ఆంజనేయరెడ్డి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. 

Updated Date - 2020-09-24T17:24:35+05:30 IST