భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదని.. శానిటైజర్ తాగి..
ABN , First Publish Date - 2020-08-20T17:13:14+05:30 IST
భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ మహిళ శానిటైజర్ తాగి ..

చీరాలటౌన్(ప్రకాశం): భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ మహిళ శానిటైజర్ తాగి ఆత్మ హత్యకు యత్నించింది. అవుట్‌పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మునిసిపల్ పరిధిలోని విఠల్ నగర్‌కు చెందిన కావూరి అమూల్య రెండు సంవత్సరాల క్రితం కారం చే డు మండల పరిధిలోని కుంకులమర్రుకు చెందిన జగదీష్‌ను కులాంతర ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం జగదీష్ కుటుంబ పెద్దలకు ఇష్టం లేక పోవడంతో వీరు విఠల్‌నగర్‌లోనే నివాసం ఉంటున్నారు. ఈనేపథ్యంలో లాక్‌డౌన్‌కు కాస్తముందు జగదీష్ తనసొంత ఇంటికి వెళ్లి వస్తానని చె ప్పి వెళ్లాడు.
నెలలు గడుస్తున్నా భర్త తిరిగి ఇంటికి రాకపోవడంతో అమూ ల్య పెద్దలు సహకారంతో భర్త దగ్గరకు వెళ్లి కాపురానికి రమ్మని పిలిచింది. అందుకు అతను నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఆమె మంగళ వారం అర్ధరాత్రి ఇంటిలో శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమ నించిన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తర లించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అవుట్‌పోస్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.