ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత

ABN , First Publish Date - 2020-12-10T05:35:08+05:30 IST

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్‌ఈబీ అధికారులు పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత

దర్శి, డిసెంబరు 9 : అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్‌ఈబీ అధికారులు పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొంతమంది వ్యక్తులు ఇసుక రీచ్‌లు లేనప్పటికీ ముసి, దోర్నపువాగు నుండి రాత్రిపూట ఇసుక తరలిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ముసి నది నుంచి ఇసుక నింపుకొని వస్తుండగా రామచంద్రాపురం వద్ద ఎస్‌ఈబీ అధికారులు ఒక ట్రాక్టర్‌ పట్టుకున్నారు. దర్శి పట్టణంలోని ఒక ప్రాంతంలో ఉన్న ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకొని పోలీస్‌స్టేషన్‌ తరలించారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Updated Date - 2020-12-10T05:35:08+05:30 IST