దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2020-12-11T06:05:27+05:30 IST

వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని మాజీ ఎంపీపీ చేదూరి విజయభాస్కర్‌ అన్నారు.

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి
మాట్లాడుతున్న విజయభాస్కర్‌

మాజీ ఎంపీపీ విజయభాస్కర్‌

 ఎర్రగొండపాలెం, డిసెంబరు 10 :  వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని మాజీ ఎంపీపీ చేదూరి విజయభాస్కర్‌ అన్నారు. ఎర్రగొండపాలెం వికలాంగుల హక్కుల పోరాట సమితి కార్యాలయంలో గురువారం జరిగిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు వీహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గుమ్మా రాజయ్య అధ్యక్షత వహించారు. వికలాంగుల కాలనీ కోసం వైఎ్‌సఆర్‌ కాలనీలో 5శాతం స్థలంలో నివేశస్థలాలు ఇప్పించేందుకు కృషిచేస్తానని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెసు ఇన్‌చార్జ్‌ ఎం వెంకటేశ్వరరావు, నియోజకవర్గ అధ్యక్షుడు చేదూరి సుధాకర్‌, ఎస్‌వో  తిరుమలదేవి, వికలాంగుల నాయకులు బి చిన్నయ్య, మండలకమిటి అధ్యక్షులు పాలంకయ్య, ఐదు మండలాల కమిటీ అధ్యక్షులు, విభిన్నప్రతిభావంతులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-11T06:05:27+05:30 IST