సాగర్‌ పైపులకు తరచూ మరమ్మతులు

ABN , First Publish Date - 2020-12-29T05:21:07+05:30 IST

పామూరు నుంచి పలు గ్రామాలకు వెళ్లే సాగర్‌ పైప్‌లైన్లు తరచూ మరమ్మతులకు గురౌతున్నాయి.

సాగర్‌ పైపులకు తరచూ మరమ్మతులు
నెల్లూరు రోడ్డులో పగిలిన సాగర్‌ పైప్‌లైన్‌ పైపుల నుంచి లీకవుతున్న నీరు


పామూరు, డిసెంబరు 28 : పామూరు నుంచి పలు గ్రామాలకు వెళ్లే సాగర్‌ పైప్‌లైన్లు తరచూ మరమ్మతులకు గురౌతున్నాయి. దీంతో సాగర్‌ నీరు సక్రమంగా సరఫరా కాక   ఆయా గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారు. వారం రోజుల నుంచి నెల్లూరు రోడ్డు స్వాగత్‌ లాడ్జి ఎదురు సాగర్‌ పైపులు పగిలిపోయి నీరంతా వృఽథాగా రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో నీటి సరఫరాను సిబ్బంది నిలిపివేయడంతో నీరు నిలిచింది.  తిరగలదిన్నె, కోడిగుడ్లపాడు, పామూరు, ఎన్జీవో కాలనీ వైపు నీరు సరఫరా లేక ఆయా ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. పైప్‌లైను పనులు చేసే క్రమంలోనే తగినంత ఇసుక పైపుల కింద వేయకపోవడంతో ఏ కొంచెం బరువు తగిలినా పైపులు పగిలిపోతున్నాయి. నెలలో ఒక సారి మండలంలోని ఎక్కడో ఒక చోట పైపులు మరమ్మతులకు గురవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పనులు నాణ్యతగా చేపట్టి నీటి వృథాను అరికట్టాలను ప్రజలు కోరుతున్నారు.  


Updated Date - 2020-12-29T05:21:07+05:30 IST