ఆర్టీసీలో భారీగా తగ్గిన సరుకు రవాణా చార్జీలు

ABN , First Publish Date - 2020-12-01T05:49:47+05:30 IST

ఆర్టీసీలో భారీగా తగ్గిన సరుకు రవాణా చార్జీలు

ఆర్టీసీలో భారీగా తగ్గిన   సరుకు రవాణా చార్జీలు

కనిగిరి, నవంబరు 30 :  ఆర్టీసీలో సరుకు రవాణాకు  సంబంధించి నేటి నుంచి భారీ తగ్గింపుతో బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించినట్లు డిపో మేనేజర్‌ ఎస్‌.రామకృష్ణ తెలిపారు.  డీఎం కార్యాలయంలో సోమవారం జరిగిన సిబ్బంది స మీక్షలో ఆయన మాట్లాడుతూ ఇకపై సగం ధరకే సరు కు రవాణా చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినట్లు డీఎం తెలిపారు. గతంలో టన్నుకు 200 కిలో మీటర్లకు రూ.100 ఉండగా, ప్రస్తుతం రూ.50కి తగ్గించినట్లు చెప్పా రు.  400 కిలో మీటర్లకు రూ.90కి బదులు రూ.48, 500 కిలో మీటర్లకు రూ.87కు గాను రూ.47 చార్జీ  చెల్లిస్తే సరి పో తుందన్నారు. ప్రతి 100 కిలోమీటర్లకు రూ. 1 చొప్పున తగ్గింపు ఉంటుందని పేర్కొన్నారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం చిన్న వ్యాపారులు, రైతులకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. అతి తక్కువ ధరతో పాటు సత్వర రవాణా ఆర్టీసీకే సాధ్యమన్నారు. 

Updated Date - 2020-12-01T05:49:47+05:30 IST