కనిపించని ఆర్టీసీ బస్సులు

ABN , First Publish Date - 2020-12-07T05:14:09+05:30 IST

దొనకొండ మండల ప్రజలకు తొమ్మిదినెలలుగా రవాణా కష్టాలు తీవ్రమయ్యాయి. కరోనా వైరస్‌ కారణంగా గత మార్చిలో నిలచి పోయిన రైళ్లు, బస్సుల రాకపోకలు నేటికి పునరుద్ధరణకు నోచుకోలేదు.

కనిపించని ఆర్టీసీ  బస్సులు
లాక్‌డౌన్‌కు ముందు దొనకొండలో తిరిగిన ఆర్టీసీ బస్సులు, రైళ్లు (ఫైల్‌)

మెరుగుపడని రైళ ్లరాకపోకలు

భారమైన ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం 

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

దొనకొండ, డిసెంబరు 6 : దొనకొండ మండల ప్రజలకు తొమ్మిదినెలలుగా రవాణా కష్టాలు తీవ్రమయ్యాయి. కరోనా వైరస్‌ కారణంగా గత మార్చిలో నిలచి పోయిన రైళ్లు, బస్సుల రాకపోకలు నేటికి పునరుద్ధరణకు నోచుకోలేదు. కరోనా ఉదృతి తగ్గిన నేపథ్యంలో ఇటీవల ఆర్టీసీ అధికారులు దాదాపుగా అన్ని ప్రాంతాలకు బస్సులను నడిపిస్తూ కనీసం మండల కేంద్రమైన దొనకొండకు మచ్చుకైనా ఒక్క బస్సు కూడా నడపక పోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్థికంగా భారమైనా ప్రైవేట్‌ వాహనాలపై ఆధారపడుతున్నారు.  ప్రైవేట్‌ వాహనాలను వినియోగించలేని పేద ప్రజలు కురిచేడు, దర్శి, మార్కాపురం తదితర ప్రాంతాలకు వెళ్లి బస్సుల్లో వారి ప్రయాణాలు కొనసాగించుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు.

మండల ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం నిత్యం దర్శి, పొదిలి, ఒంగోలు తదత ర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆ టో ప్రయాణమే దిక్కుఅయిం ది. అయితే ఇదే అదునుగా భావించిన ఆటో డ్రైవర్లు రెట్టింపు ధరను ప్రజల నుండి ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారు. దొనకొండ ప్రాంత ప్ర జలు ఎక్కువగా రైలు ప్రయాణాల్లో వారి రాకపోకలు జరుపుకుంటుంటారు. రైల్వే అధికారులు సైతం ఇటీవల ప్రా రంభించిన హౌరా-యశ్వంతపూర్‌, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌, యశ్వంత్‌పూర్‌,  కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు బెంగళూర్‌, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉండేవి. అ టువంటి రైళ్లకు అధికారులు దొనకొండలో ప్రస్తుతం నిలపడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి దొనకొండ ప్రజల రవాణా కష్టాలు గుర్తించి బస్సులు రాకపోకలు పునరుద్దరించాలని కోరుతున్నారు.


Read more