3లోపు రైస్‌కార్డులు పంపిణీ చేయాలి : జేసీ

ABN , First Publish Date - 2020-08-01T10:52:05+05:30 IST

జిల్లాకు నవశకం పథకం కింద మంజూ రైన రైస్‌ కార్డులను ఈనెల 3వ తేదీలోపు సచివాలయాల ..

3లోపు రైస్‌కార్డులు పంపిణీ చేయాలి : జేసీ

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 31 : జిల్లాకు నవశకం పథకం కింద మంజూ రైన రైస్‌ కార్డులను ఈనెల 3వ తేదీలోపు సచివాలయాల వారీగా పంపిణీ చే యాలని జేసీ-1 వెంకటమురళీ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ నుం చి జిల్లాలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భం గా జేసీ మాట్లాడుతూ ఇప్పటికే మంజూరైన రైస్‌ కార్డులు పంపిణీ చేయకపో వడంపై జేసీ ఆగ్రహం వ్యక్తంచేశారు.  కార్డుల్లో పేర్లు, చిరునామా తప్పుగా ఉంటే పొరపాట్లను సవరించి రేషన్‌కార్డులు అందజేయాలని ఆదేశించారు. స మావేశంలో జేసీ-2 చేతన్‌, డీఆర్వో కృష్ణవేణి, డీఎస్‌వో వెంకటేశ్వర్లు, జడ్పీ డి ప్యూటీ సీఈవో సాయికుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-01T10:52:05+05:30 IST