స్థానిక సమరానికి.. మోగిన నగారా

ABN , First Publish Date - 2020-03-08T11:11:00+05:30 IST

స్థానిక సమరానికి భేరి మోగింది. రాష్ట్రవ్యాప్తంగా తక్కువ వ్యవధిలోనే మండల, జిల్లా, మునిసిపల్‌, పంచాయతీ

స్థానిక సమరానికి.. మోగిన నగారా

అమలులోకి ఎన్నికల కోడ్‌

నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామన్న కలెక్టర్‌

రాజకీయ పక్షాలతో సమావేశం

పలుచోట్ల ఫ్లెక్సీలు, ఇతరాలు తొలగింపు

ఈసీ అనుమతితో బీచ్‌ పెస్టివల్‌ నిర్వహణ

ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష


ఒంగోలు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సమరానికి భేరి మోగింది. రాష్ట్రవ్యాప్తంగా తక్కువ వ్యవధిలోనే మండల, జిల్లా, మునిసిపల్‌, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. తొలుత మండల, జడ్పీ, తర్వాత మునిసిపాలిటీల్లో ఒక్కొక్క విడత ఎన్నికలు జరగనుండగా ఆ తర్వాత రెండుదశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.


ఈసీ నిబంధనల ప్రకారం షెడ్యూల్‌ ప్రకటన వెలువడిన వెంటనే కోడ్‌ అమలులోకి రావడంతో తదనుగుణంగా చర్యలను అధికారులు చేపట్టారు. షెడ్యూల్‌ ప్రకటన వచ్చేలోపుగానే ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలు కొన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. అలాగే సాయంత్రం వారు కొత్తపట్నం సముద్రతీరంలో టూరిజం శాఖ నిర్వహించే బీచ్‌ పెస్టివల్‌ కోడ్‌ అమలుతో అక్కడ వారి అధికారిక సభ నిర్వహణను నిలిపివేశారు. అయితే ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేకంగా అనుమతిని పొంది పెస్టివల్‌ను కలెక్టర్‌ భాస్కర్‌ నిర్వహించారు. సాధారణ ఉత్సవంలాగా నిర్వహించాలని ఈసీ సూచించడంతో తదనుగుణంగా బీచ్‌ పెస్టివల్‌ జరిగింది. దీంతో ఆ కార్యక్రమానికి మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట మాత్రం సాధారణ పర్యాటకుల వలే హాజరయ్యారు. 


ప్రత్యేక సమావేశం..

మరోవైపు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన నేపథ్యంలో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, కోడ్‌ అమలు తదితర అంశాలపై వివిధ రాజకీయపక్షాల ప్రతినిధులతో కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆలాగే తొలుత నిర్వహించనున్న మండల, అలాగే తొలుత నిర్వహించనున్న మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్‌. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అలాగే నియోజకవర్గ స్థాయి అధికారులుగా నియమితులైన వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారికి ఎన్నికల మార్గదర్శకాలు, నిర్వహణ తీరుపై శిక్షణతో పాటు అందుకు అవసరమైన కీలక మెటీరియల్‌ను అందజేశారు.


మరోవైపు ఎన్నికల నిర్వహణలో వివిధ సమయాలలో చేసే నామినేషన్లు స్వీకరన , పరిశీలన, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, మెటీరియల్‌ పంపిణీ, ఓట్ల లెక్కింపు కేంద్రాలు తదితరాలపై ఇప్పటికే ఒక అవగాహనతో ఉన్న యంత్రాంగం ఆ చర్యలను మరింత వేగవంతం చేసింది. సిబ్బంది నియామకంపై కసరత్తు చేస్తున్నారు. మొత్తం నాలుగు విభాగాల్లోని స్థానిక సంస్థలకు దశల వారీగా ఇంచుమించు 20రోజుల వ్యవధిలోనే ఎన్నికల ప్రక్రియను ముగించాల్సి రావడంతో అధికారయంత్రాంగం మరింత అప్రమత్తమయ్యారు. రాత్రింబవళ్ళు పనిచేస్తేనే తప్ప ప్రక్రియ సజావుగా జరిగే అవకాశం లేక పోవడంతో తదనుగుణంగా దృష్టిసారించారు. కాగా ఎంపీటీసీ, జడ్పీటిసి ఎన్నికలు ఈనెల 9న తొలుత జరగనుండగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో తక్షణం సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించారు. వాటికి కొనసాగింపుగా మునిసిపల్‌, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపైనా దృష్టిపెట్టారు. మరోవైపు కలెక్టర్‌ రాజకీయ పక్షాలతో కూడా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కలెక్టర్‌ కోరారు. కాగా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల షెడ్యూల్‌ వివరాలు ఇలా ఉన్నాయి

ఈనెల 9న రిటర్నింగ్‌ అధికారులు నోటిఫికేషన్‌ ఇస్తారు

9 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ

12న నామినేషన్ల పరిశీలన

13న తిరస్కరించిన నామినేషన్లకు అప్పీలు దాఖలు( జడ్పీటీసీలకు కలెక్టర్‌ వద్ద, ఎంపీటీసీలకు ఆర్డీవోల వద్ద)

14న మధ్యాహ్నం 1గంటలోపు అప్పీళ్ళ పరిష్కారం, మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు ఉపసంహరణలు, సాయంత్రం 5గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితా ప్రకటన

21న ఉదయం 7 గంటల నుంచి 5గంటల వరకు పోలింగ్‌ నిర్వహణ

24న ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రా రంభం అవుతుం ది. లెక్కింపు పూ ర్తయిన వెంటనే ఫలి తాలు వెల్లడి చేస్తారు

ఇదిలా ఉండగా మునిసిపల్‌ ఎన్నికలకు ఈనెల 9న, పంచాయతీ ఎన్నికలలో తొలిదశకు 15న రెండవ దశకు 17న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. తదనుగుణంగా జిల్లాలో షెడ్యూల్‌ ప్రకటిస్తామని కలెక్టర్‌  తెలిపారు. 


Updated Date - 2020-03-08T11:11:00+05:30 IST