కోలుకున్న కరోనా రోగులు
ABN , First Publish Date - 2020-04-26T12:09:31+05:30 IST
మన వాళ్లు కొవిడ్-19ను జయించారు. మన వైద్యులు చేసిన కృషి ఫలిస్తోంది. కరోనా మహమ్మారి నుంచి పాజిటివ్ రోగులు అందరూ ..

ఆసుపత్రి నుంచి 23మంది డిశ్చార్జి
నెల్లూరు కొవిడ్ ఆసుపత్రి నుంచి వృద్ధుడు
వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు
మన వాళ్లు కొవిడ్-19ను జయించారు. మన వైద్యులు చేసిన కృషి ఫలిస్తోంది. కరోనా మహమ్మారి నుంచి పాజిటివ్ రోగులు అందరూ కోలుకుంటున్నారు. జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 23మంది శనివారం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత ఎన్నో అనుమానాలు.. ఇదివరకు ఎప్పుడూ తెలియని కొత్త వ్యాధి.. వైద్యం ఎలా చేయాలో తెలియని గందరగోళం.. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన రోగుల పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. మన వైద్యుల అంకితభావం.. విపత్కర పరిస్థితుల్లో మేమున్నామంటూ ముందుకొచ్చి వైద్యమందించడం రోగులకు కొండంత మనోధైర్యాన్ని ఇచ్చింది. దీంతో 23 మంది కరోనాను జయించారు. మిగిలిన వారి పరిస్థితి కూడా నిలకడగానే ఉంది.
ఒంగోలు నగరం, ఏప్రిల్ 25 : జిల్లాలో పాజిటివ్‌గా నిర్ధారణ అయి న వారికి రిమ్స్ వైద్యులు, కిమ్స్ వైద్యులు అందించిన సేవలు ఎనలేని వి. వాళ్ల ప్రాణాలను పణంగా పెట్టి రోగులను కాపాడిన దేవుళ్లు వాళ్ళు అనటంలో అతియో శక్తిలేదు. పాజిటివ్ రోగులకు వైద్యం చేస్తూ పలు చోట్ల వైద్యసిబ్బంది, వైద్యులు కూడా కరోనా బారినపడుతున్నారు. అయినా మన వైద్యులు వాటిని లెక్కచేయకుండా నిద్రాహారాలు మా నుకుని రోగులకు సేవలు అందించారు. వారికి తోడు గా వైద్య సిబ్బంది తమ వంతు బాధ్యతలను నెరవేర్చా రు. ఈ నెలరోజులు కుటుంబాలను కూడా పట్టించుకోకుండా కరోనా వార్డుల్లోనే రోగులకు భరోసా ఇస్తూ గడిపారు. ఈ సేవల తో జిల్లాలోని పాజిటివ్ రోగుల్లో 23మంది శనివారం ఒక్కరోజే ఆసుప త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
పూర్తిగా కోలుకున్న వృద్ధుడు
రిమ్స్‌లో చికిత్సపొందుతున్న వారిలో 11మంది. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిలో మరో 11మందిని వైద్యులు రిలీవ్ చేశారు. ఒంగోలు ఇస్లాంపేటకు 70 ఏళ్ళ వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉండటంతో 20 రోజుల క్రితం మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. ఆ వృద్ధుడు కూడా పూర్తిగా కోలుకున్నాడు. అక్కడి వై ద్యులు అతన్ని శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. రాత్రికి ఒంగోలు చేరుకు న్నారు. శనివారం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయిన వారిలో ఒంగోలు, చీరాలు, కందు కూరు, చీమకుర్తి ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.
కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన 11మంది ఒంగోలుకు చెందిన వారే. రిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన వారిలో చీరాలకు చెందిన నలుగురు, ఒంగోలుకు చెందిన ముగ్గురు, చీమకుర్తి ఒకరు, కందుకూ రుకు చెందిన ఇద్దరు ఉన్నారు. జిల్లాలో ఇప్పటివరకూ పాజిటివ్ వచ్చిన రోగులు 53 మం ది కాగా వీరిలో తొలి కేసుగా నమోదైన ఒంగోలు జడ్పీ కాలనీ యువకుడు పూర్తిగా కోలు కుని పదిహేనురోజుల క్రితమే రిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కరోనాను జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వారి సంఖ్య 24 అవుతుంది.
మిగతా వారు డిశ్చార్జ్‌కి సిద్ధం
కిమ్స్ ఆసుపత్రులో చికిత్స పొందుతున్న 25 మందిలో శనివారం 11మందిని డిశ్చార్జి చేయగా మిగిలిన వారు కూడా పూర్తిగా కోలుకున్నారు. వీరికి కూడా పరీక్షల్లో నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. వీరిని త్వరలోనే డిశ్చార్జి చే యనున్నారు. కాగా పాజిటివ్ కేసుల్లో ఇద్దరు ముగ్గురికి చికిత్స అందించిన అనంత రం పరీక్షలు చేయగా మళ్లీ పాజిటివ్ వస్తుండటం కాస్తంత ఆందోళన కలిగిస్తోంది. పరీ క్షల్లో పాజిటివ్ వస్తున్నా వీరు మాత్రం కరోనా లక్షణాలు ఏమాత్రం కనిపించకుండా ఆరో గ్యంగానే ఉన్నారు. దీంతో మరోసారి పరీక్షలు చేయించి వీరికి కూడా నెగటివ్ ఫలితాలు వచ్చాక డిశ్చార్జి చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద కరోనా రోగులు చికిత్సకు స్పందించి కోలుకో వడం చూస్తుంటే వైద్యవర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కరోనా పాజిటివ్ రోగులకు విజయవంతంగా వైద్యం అందించగలమన్న మనోధైర్యం వారిలో కనిపిస్తోంది.
ట్రూనాట్‌తో వెలుగులోకి వస్తున్న పాజిటివ్ కేసులు
జిల్లాలో ట్రూనాట్ యంత్రాల ద్వారా ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ర్యాపిడ్ కిట్స్, క్లియా, వీఆర్‌డీఎల్ ల్యాబ్‌ల ద్వారా పరీక్షలు ఇంకా ప్రారంభం కాలేదు. కానీ క్షయనివారణ సంస్థ ద్వారా మాత్రం పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 17 ట్రూనాట్ మిషన్ల ద్వారా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. వీటిపై రోజుకు 320దాకా పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్ష ఇప్పటి వరకు 50దాకా పాజిటివ్‌లు వచ్చినట్లు సమా చారం. అయితే వీటి ద్వారా పాజిటివ్‌లుగా తేలినా అధికారులు మాత్రం ధ్రువీకరించటం లేదు. తిరిగి వీరికి వీఆర్‌డీఎల్ ద్వారా పరీక్షలు చేసి పాజిటివ్ వస్తేనే నిర్ధారిస్తున్నారు. ట్రూనాట్‌పై పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వాటిలో 30శాతమే వీఆర్‌డీఎల్ పరీక్షలో పాజిటివ్‌లుగా వస్తున్నాయని వైద్యులు అంటున్నారు.