-
-
Home » Andhra Pradesh » Prakasam » re couneselling for pramostoins to telugu hindi pandits
-
తెలుగు, హిందీ పండిట్ల ఉద్యోగోన్నతులకు రీకౌన్సెలింగ్
ABN , First Publish Date - 2020-11-27T06:17:42+05:30 IST
జిల్లాలో తెలుగు, హిందీ స్కూలు అసి స్టెంటు పోస్టులకు నిర్వహించిన ఉద్యోగోన్నతల కౌన్సెలింగ్‌ను రద్దు చేసి తా జాగా నిర్వహించాలని రాష్ట్రపాఠశాల విద్య డైరెక్టర్ వి.చినవీరభద్రుడు గురు వారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఒంగోలువిద్య, నవంబరు 26: జిల్లాలో తెలుగు, హిందీ స్కూలు అసి స్టెంటు పోస్టులకు నిర్వహించిన ఉద్యోగోన్నతల కౌన్సెలింగ్‌ను రద్దు చేసి తా జాగా నిర్వహించాలని రాష్ట్రపాఠశాల విద్య డైరెక్టర్ వి.చినవీరభద్రుడు గురు వారం ఉత్తర్వులు జారీ చేశారు. స్కూలుఅసిస్టెంటు తెలుగు, హిందీ పో స్టులు భర్తీకి అక్టోబరు 21న డీఈవో ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్‌ను నిర్వహిం చారు. కేవలం గ్రేడ్-2 భాషోపాధ్యాయులను మాత్రమే పరిగణలోకి తీసుకో కుండా సెకండరీగ్రేడ్ టీచర్లకు అన్యాయం చేశారని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సింగిల్ సబ్జెక్టు, థర్డ్ మెధడాలజీ ఉ న్నవారికి కూడా ఉద్యోగోన్నతులు ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నా పరిగణలోకి తీసుకోలేదనే విషయాన్ని డైరెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన డై రెక్టర్ ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాలను సవరించి పారదర్శకంగా తుదిజాబితాను ప్రకటించాలని ఆదేశించారు. పాఠశాల విద్య ఆరీఏ్జడీ పర్య వేక్షణలో తాజాగా ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు.