బోర్లకు మీటర్ల విధానాన్ని వెనక్కి తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-11-13T23:46:49+05:30 IST

తక్షణమే వ్వవసాయ బోర్లకు మీటర్లు బిగించే విధానాన్ని వెనక్కి తీసుకోవాలనిసీపీఎం మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

బోర్లకు మీటర్ల విధానాన్ని వెనక్కి తీసుకోవాలి
మెటారుబైక్‌ ర్యాలీ చేస్తున్న సీపీఎం నేతలు

సీపీఎం అధ్వర్యంలో నిరసన ర్యాలీ


బల్లికురవ, నవంబరు 13 . కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తక్షణమే వ్వవసాయ బోర్లకు మీటర్లు బిగించే విధానాన్ని వెనక్కి తీసుకోవాలనిసీపీఎం  మండల  కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. శుక్రవారం  ఆపార్టీ  ఆధ్వర్యంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మండలంలోని కూకట్లపల్లి గ్రామం నుంచి బల్లికురవ వరకు మెటార్‌బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని లేకుంటే రైతులు తీవ్రంగా నష్ట పోతారన్నారు. కార్మికుల పొట్ట కొట్టేలా తీసుకుంటున్న నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు అలానే దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. రాష్ట విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలన్నారు.నిత్యావసర వస్తువులు, ఉల్లి పాయల ధరలు అకాశాన్నంటుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని అరోపించారు ఈ నిరసన ర్యాలీలో సీపీఎం నేతలు  గొల్లపూడి అంజయ్య, బొజ్జా ఏడుకొండలు, రమణయ్య,  వీరయ్య తదితర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T23:46:49+05:30 IST