జగనన్న కాలనీల పేరుతో రావణకాష్టం చేయొద్దు

ABN , First Publish Date - 2020-12-29T04:29:18+05:30 IST

పేదలకు ఇంటి స్థలాల పేరుతో ఏర్పాటు చేసిన జగ నన్న కాలనీలను రావణకాష్టంలా మార్చ వద్దని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు.

జగనన్న కాలనీల పేరుతో రావణకాష్టం చేయొద్దు
తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందికి దరఖాస్తు అందజేస్తున్న ఉగ్ర


ఉగ్ర నరసింహారెడ్డి

ఇళ్ల స్థలాలపై సమాచారమివ్వండి

తహసీల్దార్‌ ఆఫీస్‌లో 

దరఖాస్తు అందజేత

పామూరు, డిసెంబరు 28 : పేదలకు ఇంటి స్థలాల పేరుతో ఏర్పాటు చేసిన జగ నన్న కాలనీలను రావణకాష్టంలా మార్చ వద్దని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. మండలంలోని ఇంటి స్థలాల కోసం వేసిన లే అవుట్లలో భూమి స్వభావం, లబ్ధి దారుల జాబితాను అందించాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కింద తహసీల్దార్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ ఏఽ ధర్మ తేజకు సోమవారం ఉగ్ర దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా ఉగ్ర మాట్లాడుతూ పేదల కోసం ఇచ్చిన ఇంటి స్థలాలు ఒకే చోట ఇ స్తుండటంతో రాజకీయంగా గందరగోళం ఏర్పడుతుందన్నారు. దాని వలన గ్రామాల్లో వర్గ విభేదాలు వచ్చే అవకాశం ఉందని ఉగ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని వ గ్గంపల్లి, గుమ్మంపాడు గ్రామాల్లో లబ్ధి దారుల అనర్హుల జాబితా, తిరస్కరించిన జా బితాను కోరుతూ సమాచారం ఇవ్వాలని దర ఖాస్తు చేశానని చెప్పారు.  ఉన్న ఊరు లోనే పట్టాలు ఇవ్వడం వల్ల లబ్ధిదారులకు మేలు జరుగుతుందని తెలిపారు. వంక, పోరం బోకు స్థలాల్లో ఇవ్వడంవల్ల మూగ జీ వాల ను మేపుకునే వారి పరిస్థితి అగమ్య గోచ రంగా మారిందన్నారు. వేరే గ్రామాల్లో స్థలా లు ఇవ్వడంవల్ల సామాజిక, రాజకీయ పరం గా ఇబ్బందులు తప్పవన్నారు.  నివర్‌తో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో అధి కారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొ గ్గడం సరికాదన్నారు. సమగ్ర విచారణ చేప ట్టి నష్టపోయిన రైతులకు పరిహారం అం దేలా చర్యలు తీసుకోవాలని ఉగ్ర డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో సింగిల్‌ విండో మా జీ చైర్మన్‌ బైరెడ్డి జయరామిరెడ్డి, జిల్లా షీప్‌ సొసైటీ డైరెక్టర్‌ ఎం.గంగరాజు యాదవ్‌, మాజీ జడ్పీటీసీ ఎం.హుస్సేన్‌రావు, మాజీ స ర్పంచ్‌ కావిటి సుబ్బయ్య, మాజీ కోఆప్షన్‌షేక్‌ ఖాజా రంహతుల్లా, గుంటుపల్లి శ్రీనివా సులు, నాయుడు బాబు, దైండె శివశంకర్‌,  రామకృష్ణ, రఫీ, గిడ్డయ్య పాల్గొన్నారు. 



Updated Date - 2020-12-29T04:29:18+05:30 IST