అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2020-12-20T06:14:58+05:30 IST
అక్రమంగా మూడు ఆటోల్లో తరలిస్తున్న 69 బస్తాల రేషన్ బియ్యాన్ని త్రిపురాంతకం పోలీసులు సోమేపల్లి రోడ్డు వద్ద శనివారం స్వాధీనం చేసుకున్నారు.

త్రిపురాంతకం, డిసెంబరు 19 : అక్రమంగా మూడు ఆటోల్లో తరలిస్తున్న 69 బస్తాల రేషన్ బియ్యాన్ని త్రిపురాంతకం పోలీసులు సోమేపల్లి రోడ్డు వద్ద శనివారం స్వాధీనం చేసుకున్నారు. బియ్యంతోపాటు మూడు ఆటోలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. సోమేపల్లిలో, రెండు ఆటోలు, గాంధీనగర్‌లో ఒక ఆటో లోడ్‌చేసి అక్రమ వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు ఎస్సై వెంకట కృష్ణయ్య తెలిపారు.