రేపటి నుంచి రేషన్‌

ABN , First Publish Date - 2020-04-28T10:31:53+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన మూడో విడత రేషన్‌ పంపిణీ బుధవారం నుంచి

రేపటి నుంచి రేషన్‌

మూడో విడత పంపిణీకి ఏర్పాట్లు

బియ్యంతోపాటు కిలో కందిపప్పు


ఒంగోలు (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 27 : కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన మూడో విడత రేషన్‌ పంపిణీ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఈసారి బియ్యంతోపాటు కందిప్పు ఇవ్వనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పౌరసరఫరాల శాఖ అధికారులు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మూడు విడతలు ఉచితంగా రేషన్‌ సరుకులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రెండు సార్లు పంపిణీ చేసింది. మూడో విడత జిల్లాలోని 9.91లక్షల మంది కార్డుదారులకు బుధవారం నుంచి సరుకులు ఇవ్వనుంది. ఒక్కో కుటుంబానికి కిలో కందిపప్పు, కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనుంది. 

Updated Date - 2020-04-28T10:31:53+05:30 IST