సమస్యల వలయంలో రామగోపాలపురం

ABN , First Publish Date - 2020-12-27T05:35:28+05:30 IST

మండలంలోని రామగోపాలపురం సమస్యలకు నిలయంగా మారింది. గ్రామంలో అంతర్గత రోడ్లు, మంచినీటి కుళాయిల వద్ద మురుగునీరు నిలిచి పారిశుధ్యం అధ్వానంగా మారింది.

సమస్యల వలయంలో రామగోపాలపురం
సచివాలయానికి వెళ్లే దారిలో పేడ దిబ్బలు, ముళ్లకంపలుపారిశుధ్యం అధ్వానం

పొంచిఉన్న వ్యాధులపై భయం..భయం

 కమ్మంపాడులో లేని వీధి దీపాలు

వెలిగండ్ల, డిసెంబరు 26: మండలంలోని రామగోపాలపురం సమస్యలకు నిలయంగా మారింది. గ్రామంలో అంతర్గత రోడ్లు, మంచినీటి కుళాయిల వద్ద మురుగునీరు నిలిచి పారిశుధ్యం అధ్వానంగా మారింది. ఇటీవల కురి సిన వర్షాలకు నీరు అక్కడక్కడా గుంటల్లో నిల్వ ఉండటంతో దోమలు వ్యాప్తి చెందాయి. పేడ దిబ్బలు కూడా ఇళ్ల మధ్యలో ఉం డడంతో దోమలు ఇతర కీటకాలతో విషజ్వరాలు వచ్చే ప్రమాదం ఉం దని ప్రజలు  భయాం దోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపట్టడం లేదని, కనీసం బ్లీచింగ్‌ చల్లిన పాపాన కూడా పోలేదని గ్రామ స్థులు ఆరోపించారు. సచివాల య కేంద్రానికి దూరంగా ఉన్న కమ్మంపాడు గ్రామానికి కనీసం వీధిలైట్లు కూడా వేయకపోవడంతో గ్రామస్థులు తీవ్ర అసస్థలు పడుతు న్నారు. సచివాలయంలో పనిచేసే సిబ్బంది సమయపాలన పాటించకుండా వ్యవహరిస్తున్నారని,  అక్కడకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే  ఫీల్డ్‌ వర్కుకు వెళ్తున్నారన్న సమాధానం విన్పిస్తోందని గ్రామస్థులు తెలిపారు.  దరఖాస్తుదారులపై కూడా పలు వురు సచివాలయ సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి గ్రామంలో నెలకున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. Updated Date - 2020-12-27T05:35:28+05:30 IST