కార్పొరేట్‌కు కేంద్రం దాసోహం: రైతు సంఘాల నేతలు ధ్వజం

ABN , First Publish Date - 2020-12-13T06:41:12+05:30 IST

కార్పొరేట్‌ శక్తులకు కేంద్ర ప్రభుత్వం దాసోహం అయిందని రైతుల సం ఘాల నాయకులు ఆరోపించారు.

కార్పొరేట్‌కు కేంద్రం దాసోహం: రైతు సంఘాల నేతలు ధ్వజం
బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద రైతుల నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న రైతు సంఘంనాయకులు

టోల్‌ ప్లాజాల వద్ద నిరసన


టంగుటూరు, డిసెంబరు 12: కార్పొరేట్‌ శక్తులకు కేంద్ర ప్రభుత్వం దాసోహం అయిందని రైతుల సం ఘాల నాయకులు ఆరోపించారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరు గుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుగా శనివారం టం గుటూరు టోల్‌ప్లాజా వద్ద నిరసన కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకు లు మాట్లాడుతూ వ్యవసాయ భూములను కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను అమలులోకి తెచ్చింద న్నారు. రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వే చ్ఛను కల్పించామని కేంద్రం చెబుతుందన్నారు. అయితే,  ఈ చట్టాల లో కనీస మద్దతు ధర ప్రస్తావనే లేదన్నారు. మూడు వ్యవసాయ చట్టాలతో ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరలు ఇక ఉం డవని, ధరల నిర్ణయం కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ పంపిణీని కూడా ప్రయివేట్‌ కంపె నీల పరం చేయబోతున్నారన్నారు. 

కార్యక్రమంలో రైతు సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు చుండూరి రంగారావు, సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) జిల్లా కార్యదర్శులు పూ నాటి ఆంజనేయులు, ఎంఎల్‌ నారాయణ, డీవీఎన్‌ స్వామి, అఖిల భా రత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కె.నాంచార్లు,  రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు, జాలా అంజయ్య, రైతు కూలీ సం ఘం జిల్లా అధ్యక్షుడు వేజండ్ల రామారావు, కార్యదర్శి ఎస్‌.లలితకు మారి,  కాంగ్రెస్‌ నాయకుడు బొడ్డు సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం విధానాలతో మార్కట్‌ కమిటీలు మూత..           

మార్టూరు, డిసెంబరు 12: కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశవ్యా ప్తంగా మార్కెట్‌ కమిటీలు మూతపడే పరిస్థితులు ఏర్పడతాయని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం బొ ల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వారు మా ట్లాడారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరను చట్టబద్ధం చేయాలన్నారు. కేంద్రం తన విధానాలను మార్చుకోకపోతే రైతులు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నిరసన కార్యక్రమం సాగింది. ఈ గంటసేపు టోల్‌ ప్లాజాలో వాహనాలకు ఎలాంటి రుసుం వసూలు చేయొద్దని రైతు నాయకులు కోరారు. అందుకు టోల్‌ప్లాజా అధికారులు అంగీకరించి, వాహనాల దగ్గర గంటసేపు డబ్బులు వసూలుచేయలేదు. కార్య క్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌,  ఆయా సం ఘాల నాయకులు రాయిని వినోద్‌, పెంట్యాల హనుమంతరావు, మజుందార్‌, వి.బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-13T06:41:12+05:30 IST