వర్షం.. సాగుకు జీవం

ABN , First Publish Date - 2020-07-10T10:53:27+05:30 IST

గిద్దలూరు ప్రాంతంలో బు ధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన వర్షం రైతులకు..

వర్షం.. సాగుకు జీవం

గిద్దలూరు, జూలై 9 : గిద్దలూరు ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన వర్షం రైతులకు ఎంతో మేలు చేసింది. 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సగిలేరుకు కొద్దిమేర వర్షం నీరు రాగా నక్కల వాగుకు మాత్రం బాగా వర్షం నీరు చేరుకున్నది. ప్రస్తుతం పత్తి, పెసర, నూగు, మినుము పంటలతోపాటు పలు కూ రగాయలు, ఆకుకూరలు సాగులో ఉన్నాయి. ఈ వ ర్షం పంటల ఎదుగుదలకు, అధిక ఉత్పత్తికి ఎం తగానో దోహదపడతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చే స్తున్నారు. ఈ వర్షంతో బోర్లలో భూగర్భ జలమట్టం కూడా పె రి గింది.  దీంతో బోర్లలో నీ రు సంవృద్ధిగా వస్తుంద ని ఆర్‌డ బ్ల్యూఎస్‌ అధి కారులు పేర్కొన్నారు. 


కొమరోలు: కొమరోలులో 14.2 మి.మీ.,వర్షపాతం నమోదు కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలు నిండిఉన్నాయి. దీనితో రైతులు పొలాల్లో మినుము, పెసర, జొన్న, పత్తి పంటలను సాగు చేస్తున్నారు. 


వేరుశనగకు  జీవంపోసిన వర్షం

చీరాల : చీరాల నియోజకవర్గంలో సాగుచేసిన వేరుశనగ పైరుకు గురువారం తెల్లవారు జామున కురిసిన వర్షం జీవం పోసింది. స్పింక్లర్లు కింద పలువురు రైతులు వేరుశనగ సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో నిర్ణీతకాలం అనేది లేకుండా వేరుశనగ సాగు చేస్తుంటారు.  వాతావరణ  పరిస్థితులు, స్ర్పింక్లర్లు కింద సాగునీటి వసతి ఉన్నవారు ఏడాదికి మూడు పంటలు వేస్తుంటారు. ప్రస్తుతం సుమారు 200 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నా రు. ఇందులో కొంతకాయ దశలో, మరికొంత పీకు డు దశలో ఉంది. ఇంకొన్నిచోట్ల పంట ఓదెలుపై ఉంది. భారీవర్షం కురిసినప్పటికీ  ఓదెలుపై ఉన్న పైరుకు కూడా ఇసుక నేలలు కావటంతో పెద్దగా నష్టం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. కూరగా యలు, ఆకుకూరల సాగుదారులు కూడా వర్షంతో మేలు జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-07-10T10:53:27+05:30 IST