జిల్లావ్యాప్తంగా వర్షం

ABN , First Publish Date - 2020-09-14T10:13:11+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి వర్షం మొదలైంది. చీరాల, పర్చూరు ప్రాంతాల్లో భారీగ కురిసింది.

జిల్లావ్యాప్తంగా వర్షం

పొంగి ప్రవహిస్తున్న సగిలేరు

గట్టుపై చిక్కుకున్న 11 మంది పశువుల కాపరులు

వారిని ఒడ్డుకు చేర్చేందుకు పోలీసుల ప్రయత్నం 

విఫలమవడంతో రాత్రికి సమీప గ్రామంలో బస


ఒంగోలు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి వర్షం మొదలైంది. చీరాల, పర్చూరు ప్రాంతాల్లో భారీగ కురిసింది. బల్లికురవ, మార్టూరు, దర్శి, తాళ్లూరు, కురిచేడు, టంగుటూరు, ఒంగోలు, కొరిశపాడు తదితర మండలాల్లో ఒక మోస్తరుగా పడింది. పలు ఇతర మండలాల్లోనూ జల్లులు కురిశాయి. నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో గిద్దలూరు సమీపంలోని సగిలేరు వాగు ఆదివారం సాయం త్రానికి పొంగింది. ఉదయమే పశువులు మేపుకునేందుకు వాగుదాటి కొండ ప్రాం తానికి వెళ్లిన గిద్దలూరు మండలం సూరే పల్లికి చెందిన 11 మంది తిరిగి వచ్చేందుకు వీలుకాక అవతలే చిక్కుకున్నారు.


విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ఒడ్డుకు చేర్చేం దుకు ప్రయత్నించారు. వాగు ఉధృతి తగ్గకపో వడంతో అది సాధ్యం కాలేదు. దీంతో పశువుల కాపరులు చిక్కుకుపోయిన వైపు ఉన్న తుమ్మలపల్లె గ్రామస్థులతో మాట్లాడారు. ఆ ప్రాంతంలోని స్కూలులోనే రాత్రి బస, వసతి ఏర్పాటుచేసి భోజన సౌకర్యాలు కల్పించారు. ఇదిలా ఉండగా తాజా వర్షాలు ప్రస్తుత వ్యవసాయ సీజన్‌కు అత్యధిక ప్రాంతాల్లో ఉపయుక్తం కానున్నాయి.  ఖరీఫ్‌లో ఇప్పటికే సాగు చేసిన పత్తి, కంది పంటలకు ఇవి మేలు చేకూర్చనున్నాయి. కొన్ని చోట్ల కోతకు వచ్చే దశలో ఉన్న సజ్జకు కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది.  

Updated Date - 2020-09-14T10:13:11+05:30 IST