4,528 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు

ABN , First Publish Date - 2020-11-21T05:59:45+05:30 IST

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు పలు రకాల పంటలు దెబ్బతిశాయి.

4,528 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
వర్షానికి కందుకూరు ప్రాంతంలో ఉరకెత్తిన మిర్చి తోట

ఒంగోలు, నవంబరు 20 (ఆంద్రజ్యోతి): జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు పలు రకాల పంటలు దెబ్బతిశాయి. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం 106 గ్రామాల్లో 4,528 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా గత వారంలో విస్తారంగా వర్షాలు కురిసిన విషయం విదితమే.  ఈనెల 12 నుంచి 17 వరకు సగటు సుమారు 86 మి.మీ. వర్షపాతం నమోదు కాగా దాదాపు సగం మండలాల్లో 100 నుంచి 200 మి.మీ. కురిసింది. ఈ వర్షాలతో  పలు చోట్ల ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు నీటమునిగిపోయాయి. వర్షం తెరిపి ఇవ్వడంతో పంట నష్టాలపై వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా రూపొందించారు. జిల్లాలో తొమ్మిది రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. వరి, మినుము, పత్తి పంటలకు నష్టం వాటిల్లగా ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. 

Read more