-
-
Home » Andhra Pradesh » Prakasam » r and b wants se
-
ఎస్‌ఈ కావలెను.. ఆర్‌అండ్‌బీశాఖలో రెండేళ్లుగా ఇన్‌చార్జి పాలన
ABN , First Publish Date - 2020-12-28T06:15:52+05:30 IST
అభివృద్ధిలో కీలకమైన రహదారులు, భవనాల(ఆర్‌అండ్‌బీ)శాఖ వి భాగం రెండేళ్లుగా ఇన్‌చార్జి పరిపాలనాధికారి పాలనలో నే ఉంటోంది. రెగ్యులర్ ఎస్‌ఈ లేకపోవడంతో పలు అభివృద్ధి పనులకు ఇబ్బందిగా మారింది.

కొరవడిన పర్యవేక్షణ
జిల్లాలో రహదారుల పరిస్థితి అధ్వానం
ఖరారైన రూ.వందల కోట్ల పనులు
ఒంగోలు(జడ్పీ), డిసెంబరు 27: అభివృద్ధిలో కీలకమైన రహదారులు, భవనాల(ఆర్‌అండ్‌బీ)శాఖ వి భాగం రెండేళ్లుగా ఇన్‌చార్జి పరిపాలనాధికారి పాలనలో నే ఉంటోంది. రెగ్యులర్ ఎస్‌ఈ లేకపోవడంతో పలు అభివృద్ధి పనులకు ఇబ్బందిగా మారింది. గతంలో ఎ స్‌ఈగా ఉన్న ఎల్.శివప్రసాద్‌రెడ్డి రెండేళ్ల క్రితం ఉద్యో గ విరమణ చేశారు. అప్పటి నుంచి పి.మహేశ్వరరెడ్డి ఇన్‌చార్జి ఎస్‌ఈగా కొనసాగుతున్నారు. మరి కొద్దిరో జుల్లో ఆయన కూడా రిటైర్డ్ కానున్నారు. ఆ తరువాత అయినా ఆర్‌అండ్‌బీశాఖకు రెగ్యులర్ ఎస్‌ఈని నియ మించే ఆలోచనను ప్రభుత్వం చేయాల్సి ఉంది. నివర్ తుపాను ముందే అస్తవ్యస్తంగా ఉన్న జిల్లాలోని రహ దారులు ప్రస్తుతం వాహనదారులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. రెగ్యులర్ ఎస్‌ఈ లేకపోవడంతో జిల్లా యంత్రాంగం మీద పర్యవేక్షణ కొరవడి క్షేత్రస్థాయి సి బ్బంది గాడితప్పుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి
జిల్లాకు ఖరారైన భారీ పనులు
నివర్ తుపానుకు ముందే రహదారుల మరమ్మతు ల కోసం ఆర్‌అండ్‌బీ రూపొందించిన నివేదికల ఆధా రంగా ప్రభుత్వం దాదాపు 42 పనులకు రూ.8కోట్లు వరకు నిధులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అ దేవిధంగా ఎన్‌డీబీ సహకారంతో రూ.187కోట్ల వ్యయం తో జిల్లాలో నిర్మించతలపెట్టిన ఏడు పనులకు ఇటీవలే టెండర్లు ఖరారయ్యాయి. ఇలాంటి కీలక సమయంలో రెగ్యులర్ ఎస్‌ఈ పర్యవేక్షణ నిత్యం కొనసాగితేనే పను లు అనుకున్న సమయానికి పూర్తయ్యే అవకాశముంది. జిల్లాలో గత రెండేళ్ల నుంచి ఆర్‌అండ్‌బీ రహదారులు కనీస మరమ్మతులకు నోచుకోలేదు. తుపానులాంటి వి పత్తులు సంభవించినప్పుడు యంత్రాంగం సకాలంలో స్పందించి నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించడం కూడా కీలకం. ఈ విషయంలో కూడా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నష్టం మదింపు కూ డా సరిగా జరగడం లేదని విమర్శలువస్తున్నాయి. దీని కితోడు జిల్లాలోని ప్రధాన రహదారులకు చేపట్టబోయే మరమ్మతులు, నూతన రోడ్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి కావాలంటే రెగ్యులర్ ఎస్‌ఈని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరికొన్ని ఖాళీలు..
ఎస్‌ఈ పోస్ట్‌తో పాటు ఆర్‌అండ్‌బీ విభాగంలో మ రికొన్ని ఖాళీలు నెలల తరబడి నియామకం కాకుండా ఉన్నాయి. డివిజన్ ఆఫీస్‌లో టెక్నికల్ అసిస్టెంట్, డ్రాఫ్ట్ మెన్ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. అదేవిధంగా స ర్కిల్ ఆఫీస్‌లో టెక్నికల్ ఆఫీసర్‌ను కూడా నియమిం చాల్సి ఉంది. పనితీరు మెరుగ్గా ఉండాలంటే ఖాళీ పో స్టులను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.