ఆర్‌అండ్‌బీ రహదారి గుంతలమయం

ABN , First Publish Date - 2020-12-16T05:21:36+05:30 IST

మండలంలోని తూర్పు గంగవరం గ్రామానికి వచ్చే ఆర్‌అండ్‌బీ రహదారి గోతుల మయంగా మారింది. ఊరిప్రవేశంలో, దారంవారిపాలెం వెళ్లే మార్గం మోకాటిలోతు గుంతలు ఉన్నాయి.

ఆర్‌అండ్‌బీ రహదారి గుంతలమయం
తూర్పుగంగవరం గ్రామంలో గుంతలమయమైన రోడ్డు


మురుగు నీటిలో ప్రయాణిస్తున్న ప్రజలు

పట్టించుకోని అధికారులు 

తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు 

తాళ్లూరు, డిసెంబరు 15 : మండలంలోని తూర్పు గంగవరం గ్రామానికి వచ్చే ఆర్‌అండ్‌బీ రహదారి గోతుల మయంగా మారింది. ఊరిప్రవేశంలో, దారంవారిపాలెం వెళ్లే మార్గం మోకాటిలోతు గుంతలు ఉన్నాయి.  దీంతో  ప్రజలు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతకాలంగా గ్రామంలోని ఆర్‌అండ్‌బీ రోడ్డు గుంతలు పడిరాక పోకలకు ఇబ్బందిగా ఉన్నా అధికారపార్టీనాయకులు, ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. రోడ్డుకు ఇరువైపులా మురుగు కాల్వలు లేక పోవడంతో మురుగునీరు రోడ్డుపై నిలిచి ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు. పలు గ్రామాల్లో  కలుషిత నీటి వల్ల వింత వ్యాధులు  వ్యాపిస్తుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పలు పర్యాయాలు ఈ గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు ఈరోడ్డు దుస్థితి గురించి పట్టించు కోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు, ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి గ్రామంలోని గుంతలుపూడ్పించి మురుగునీరు నిల్వవుండకుండా చర్యలుచేపట్టి తమ కష్టాలను తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.



ప్రారంభమైన ధ్వజ స్తంభ ప్రతిష్ఠోత్సవాలు

సీఎస్‌పురం, డిసెంబరు 15 : స్థానిక పురాతణ దేవస్థానమైన శ్రీ కామాక్షి స మేత చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థాన నూతన ధ్వజస్తంబ,  బొడ్డురాయి, సీత లాంబ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమ య్యా యి. ఈ సందర్బంగా దేవస్థానంలో వేద పండితుల ఆధ్వర్యంలో గ్రామ పదక్షిణ నిర్వహించి గణపతిపూజ, వేద పారా యణం, యాగశాలలో వివిధ రకాల పూ జలు, రుద్రాభిషేకాలు, సహస్ర నామార్చనలు, కుంకుమా ర్చనలు నిర్వహించి అమ్మవారిని, స్వామివార్లను ఆలయ అర్చకులు శ్రీకృష్ణశర్మ ప్రత్యేకంగా అలంకరించారు. ఈ కార్యక్ర మాలలో అయ్యప్ప, శివ మాలాధారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-16T05:21:36+05:30 IST