క్వారంటైన్‌ కేంద్రాల్లో నాణ్యమైన భోజనం : జేసీ

ABN , First Publish Date - 2020-07-15T10:20:18+05:30 IST

క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న వ్యక్తులకు నాణ్యమైన భోజనం అందించేలా తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌-2 టీఎస్‌. చేతన్‌ అధికారులను ..

క్వారంటైన్‌ కేంద్రాల్లో నాణ్యమైన భోజనం : జేసీ

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 14 : క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న వ్యక్తులకు నాణ్యమైన భోజనం అందించేలా తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌-2 టీఎస్‌. చేతన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఒంగోలులోని రైజ్‌, పేస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లోని క్వారంటైన్‌ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ క్వారంటైన్‌ కేంద్రాలను స మర్థవంతంగా నిర్వహించాలన్నారు. ప్రధానంగా వసతి, భోజన సదుపాయా లు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం మెరుగ్గా ఉండాలని ఆయన చెప్పారు. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నందున అందుకు అనుగుణంగా  వా రం రోజులకు సంబంధించిన మెనూ పట్టికను ఆయా కేంద్రాల వద్ద నోటీసు బోర్డులో ఉంచాలని ఆదేశించారు. ఆయన వెంట భూసేకరణ ప్రత్యేకాధికారి జి.గంగాధర్‌గౌడ్‌, తహసీల్దార్‌ చిరంజీవి, క్వారంటైన్‌ కేంద్రాల ఇన్‌చార్జి, గృహ నిర్మాణశాఖ ఇంజనీర్‌ రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-15T10:20:18+05:30 IST