నిబంధనల మేరకే కొనుగోలు చేయాలి
ABN , First Publish Date - 2020-03-08T10:49:10+05:30 IST
నిబంధనల మేరకే శనగలు కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్ డీఎం ఉపేంద్ర ఆదేశించారు.

పంగులూరు, మార్చి 7: నిబంధనల మేరకే శనగలు కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్ డీఎం ఉపేంద్ర ఆదేశించారు. పంగులూరు మార్కెట్ యార్డులోని శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం పరిశీలిం చారు. శనగల నాణ్యతను పరిశీలించిన డీఎం కొనుగోలులో తేమ 14 శాతం వరకు అనుమతించాలన్నారు. కోల్డ్‌సో రేజ్ నుంచి వచ్చే శనగల కొనుగోలుకు అనుమతించవద్దని రైతులు నుంచే నేరుగా తెచ్చిన శనగలు మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు.
కొనుగోలు కేంద్రాలలో రోజుకు 500 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. రైతు నుంచి కొనుగోలు చేసిన శనగలకు వారంలో డబ్బు చెల్లించడం జరుగు తుందన్నారు. ఈ-క్రాపింగ్ లేకుండా శనగల కొనుగోలు చేయడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే కొనుగోలు చేపడతామని రైతులకు తెలిపారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి సుభాస్‌సాయి, పీఏసీఎస్ అధ్యక్షుడు రావూరి రంగారావు, సాంబశివ పలువురు రైతులు పాల్గొన్నారు.