పెండింగ్ బిల్లులు చెల్లించాలని నిరసన
ABN , First Publish Date - 2020-07-18T11:13:46+05:30 IST
గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంఽధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలుగు యువత ..

టంగుటూరు, జూలై 17 : గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంఽధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలుగు యువత మండలాధ్యక్షుడు కాట్రగడ్డ అనిల్ శుక్రవారం పంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులొచ్చాయని, అందులో తనకు రావాల్సిన రూ.5 లక్షల పెండింగ్ బిల్లులను చెల్లించాలని కార్యాలయం ఎదుట భీష్మించుకు కూర్చున్నాడు. ఇతనికి స్థానిక టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు.