రైతు వ్యతిరేక బిల్లుల రద్దుకు డిమాండ్‌

ABN , First Publish Date - 2020-12-13T06:34:51+05:30 IST

కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాలకు మద్దతుగా శనివారం ఎర్రగొండపాలెం సమీపంలోని మిల్లంపల్లి టోల్‌ ప్లాజా వద్ద సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ధర్నా చేశారు.

రైతు వ్యతిరేక బిల్లుల రద్దుకు డిమాండ్‌


ఎర్రగొండపాలెం, డిసెంబరు 12: కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాలకు మద్దతుగా శనివారం ఎర్రగొండపాలెం సమీపంలోని మిల్లంపల్లి టోల్‌ ప్లాజా వద్ద సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ధర్నా చేశారు. ఈ ధర్నాలకు న్యాయకత్వం వహించిన కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీ మెడబలిమి వెంకటేశ్వరరరావు మాట్లాడుతూ రైతులను కంటతడి పెట్టినా ప్రభుత్వాలు ఎక్కవకాలం మనుగడ సాగించలేవని అన్నారు. బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చాక రైతు వ్యతిరేక విధానాలకు అవలంభిస్తూ కార్పోరేట్‌ సంస్థలకు మద్దతు పలుకుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఈశాన్య రాష్ట్రాల రైతు ప్రతినిధులు జరిపిన చర్యలు విఫలం కావడంతో శనివారం జాతీయ రహదారిపై టోల్‌ గేట్ల వద్ద ధర్నాలకు దిగామని అన్నారు. ఈ ధర్నాతో అరగంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసుల జోక్యంతో ధర్నా విరమించారు. సీపీఐ సీనియర్‌ నాయకులు టీసీహెచ్‌ చెన్నయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేవీ.కృష్ణగౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు డి.బాలకృష్ణరెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి కె గురవయ్య, నాయకులు పెదబాబు, పవన్‌కుమార్‌, నక్కా తిరుపతయ్య, నాగరాజులు ధర్నాలో పాల్గొన్నారు.

Updated Date - 2020-12-13T06:34:51+05:30 IST