దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కృషి
ABN , First Publish Date - 2020-12-13T06:22:20+05:30 IST
రాష్ట్రంలో దేవాలయా ల ఆస్తుల పరిరక్షణ కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని దేవదాయ, ధర్మాదాయ శాఖమంత్రి వె ల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
కందుకూరు, డిసెంబరు 12: రాష్ట్రంలో దేవాలయా ల ఆస్తుల పరిరక్షణ కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని దేవదాయ, ధర్మాదాయ శాఖమంత్రి వె ల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాను గుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వ హించిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పా ల్గొన్నారు. పట్టణ ంలో జనార్దన స్వామి ఆలయ రాజ గోపుర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆల య అధికారులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామదేవత అంకమ్మ తల్లి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల నుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాల దేవాలయ భూములున్నాయన్నారు. వీ టిలో ఆక్రమణ దారుల చెరలో ఉన్న స్థలాలు, భూము లను విడిపించటంతో పాటు వారిపై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడు తూ జనార్దన స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు చేప డుతుండటమే గాక అంకమ్మతల్లి ఆలయ జీర్ణోద్ధరణ కు పూనుకున్నామన్నారు. అంకమ్మతల్లి ఆలయాన్ని రూ.2.5 కోట్లతో పునర్నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే రూ.87 లక్షలు విరాళంగా వచ్చాయన్నారు. ఈ చెక్కు ని మంత్రి చేతుల మీదుగా దేవదాయ శాఖ అధికా రులకు అందించగా, ప్రభుత్వం నుంచి కోటి రూపా యలు మంజూరు చేస్తానని మంత్రి ప్రకటించారు.
మధ్యాహ్నం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపం లో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంత్రి, ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమం లో దేవదాయ శాఖ కమిషనర్ చంద్రశేఖర రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ జి.మాధవి, జనార్దన స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఆర్. బ్రహ్మానందం తదిత రులు పాల్గొన్నారు.
మాలకొండ ఆలయ అభివృద్ధికి కృషి
వలేటివారిపాలెం, డిసెంబరు 12: మాలకొండ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం లక్ష్మీనరసింహ స్వామిని ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డితో కలిసి మంత్రి ద ర్శించుకున్నారు. పూర్ణకుంభంతో మంత్రికి ఆలయ అధి కారులు స్వాగతం పలికారు. గర్భగుడిలో వేదపండితు లు ప్రత్యేక పూజలు చేసి శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ మాలకొండ లక్ష్మీనృసింహస్వామి దేవాలయాన్ని రాష్ట్రంలోనే దేవాల యాలన్నీ ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. కార్యక్ర మంలో ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
శివాలయం పునర్నిర్మాణానికి సాయం
గుడ్లూరు, డిసెంబరు 12: నీలకంఠేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు అన్నారు. శనివారం గుడ్లూరులోని గంగా పార్వ తీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రితో పాటు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శివాలయం పున ర్నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా నిధులను విడుదల చేయిస్తానని చెప్పారు. నీలకంఠేశ్వర స్వామి ఆలయ కమిటీ నేతృత్వంలో దాతలు ద్వారా సేకరించిన రూ. 33 లక్షల 90 వేలు నగదును మంత్రి చేతుల మీదుగా దేవదాయశాఖ అధికారులకు అందజేశారు. కార్యక్ర మంలో దేవదాయశాఖ డీసీ చంద్రశేఖర్‌రెడ్డి, ఏసీ మా ధవి, ఈవో కృష్ణవేణి, లింగయ్యనాయుడు, తహసీల్దార్ శ్రీశిల్ప, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, బొమ్మిశెట్టి విశ్వ నా ఽథం, సోమానాయుడు, చుండూరి కొండయ్య తదిత రులు పాల్గొన్నారు.