-
-
Home » Andhra Pradesh » Prakasam » Prakasham news sp
-
నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు : ఎస్పీ
ABN , First Publish Date - 2020-03-23T11:01:24+05:30 IST
నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు : ఎస్పీ

ఒంగోలు (క్రైం), మార్చి 22 : విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ హెచ్చరించారు. కరోనాను నిరోధించేందుకు ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ పర్యవేక్షణలో భాగంగా ఆదివారం ఆయన నగరంలో పర్యటించారు. సాయంత్రం 5 గంటలకు మంగమూరు రోడ్డుకు చేరుకొన్న ఆయన అక్కడి ప్రజలతో కలిసి చప్పట్లు కొట్టి వైద్యులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని పిలుపునకు జిల్లా ప్రజల స్పందించిన తీరు ప్రసంశనీయమన్నారు. ఆయన వెంట ఒంగోలు డీఎస్పీ ప్రసాద్, ట్రాఫిక్ డీఎస్పీ వేణుగోపాల్, సీఐలు లక్ష్మణ్, భీమానాయక్, శ్రీకాంత్‌బాబు ఉన్నారు.