కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-03-23T11:09:04+05:30 IST

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని


ఒంగోలు (కలెక్టరేట్‌), మార్చి 22: అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి కరోనా కట్టడికి నిరంతరం కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. రాష్ట్రంలోని కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె ఆదివారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు వచ్చిన జిల్లాల్లో లాక్‌డౌన్‌ అమలు చేయాలని కేంద్రం ఆదేశించిందన్నారు. అయి తే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌ అమలు చేయాలని నిర్ణయించారని చెప్పారు. రవాణాతోపాటు మాల్స్‌, హోటళ్లు, సినిమాహాళ్లు పార్కులను మూసివేయాలని ఆదేశించారు. కరోనా వైరస్‌ నివారణ కోసం ఐసోలేషన్‌ వార్డులతో పాటు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకో వాలని సూచించారు.


ఈనెల 29వ తేదీ నాటికి రేషన్‌ షాపులకు నిత్యావసరాలను సరఫరా అయ్యేలా చూడాలన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా పేదలు ఉపాది కోల్పో తున్నందున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చేనెల 4న  వలంటీర్ల ద్వారా రూ. వెయ్యి న గదు అందించాలన్నారు. వీడి యో కాన్ఫరెన్ప్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ సంబంధిత శాఖల అధికారు లతో సమావేశం నిర్వహించారు. ఈసమావే శంలో పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం లాక్‌డౌన్‌పై  ఎస్పీ సిదార్ధర్థ కౌశల్‌తో కలెక్టర్‌ భాస్కర్‌ చర్చించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ షన్మోహన్‌, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. 


జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తూ కలెక్టర్‌ పోల భాస్కర్‌ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.  సోమవారం నుం చి ఈనెల 31తేదీ వరకు ఇది అమలులో ఉం టుంది. పభలు సమావేశాలు, పది మంది ఒక చోటుకు చేరడం నిలుపుదల చేశారు. జిల్లాలో 144 సెక్షన్‌ అమలుకు ప్రజానీకం సహకరించాలని కలెక్టర్‌ కోరారు.

Updated Date - 2020-03-23T11:09:04+05:30 IST