మాంసం ఎక్కువ తిన్నావంటూ ఘర్షణ.. హత్య

ABN , First Publish Date - 2020-03-23T11:04:26+05:30 IST

మాంసం ఎక్కువ తిన్నావంటూ ఘర్షణ.. హత్య

మాంసం ఎక్కువ తిన్నావంటూ ఘర్షణ.. హత్య

తమ్ముడిపై కత్తితో వరుసకు అన్న దాడి

కొర్రప్రోలులో ఘటన


పెద్దదోర్నాల, మార్చి 22 : మాంసం తినే విషయమై ఏర్పడిన ఘర్షణలో దాసరి అంకన్న(20)ను వరుసకు అన్న అయిన దాసరి గురవయ్య కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ దుర్ఘటన మండలంలోని కొర్రప్రోలు గిరిజన గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కొర్రప్రోలుకు చెం దిన దాసరి పోతురాజు, అంకన్నలు అన్నదమ్ములు. వాళ్ల అమ్మ మృతి చెందడంతో తండ్రి గురవయ్యఆ గూడేనికి చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు పెళ్లై భర్త చనిపోగా, దాసరి గురవయ్య అనే కుమారుడు ఉన్నాడు.


అందరూ ఒకే ఇంట్లో  ఉంటున్నారు. ఆదివారం కావడంతో  మేకమాంసం వండారు. తినేవిషయంలో పోతురాజు కొంత ఎక్కువ భాగం మాంసం వేసుకున్నాడని సవతి తల్లి కొడుకు గురవయ్య మందలించాడు. అక్కడే ఉన్న అంకన్న, పోతురాజులు ఇద్దరూ గురవయ్యను కొట్టా రు. కోపోద్రిక్తుడైన గురవయ్య  కత్తితో వచ్చి అంకన్న వెనుక వైపున మెడపై బలంగా పొడిచాడు. అంకన్న అక్కడికక్కడే కుప్పకూలాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై షేక్‌ అబ్దుల్‌రహమాన్‌ ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ క్రమంలో ఎర్రగొండపాలెం సీఐ మారుతీకృష్ణ, పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-03-23T11:04:26+05:30 IST