-
-
Home » Andhra Pradesh » Prakasam » Prakasham news accident
-
బోల్తా పడిన కారు.. ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2020-03-23T11:06:03+05:30 IST
బోల్తా పడిన కారు.. ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

ముండ్లమూరు, మార్చి, 22 : కారు అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ముండ్లమూరు మండలం బృందావనం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా.. బృందావనం తండాకు చెందిన సదావత్ జీమ్లానాయక్ కుమారుడు శేఖర్‌నాయక్(24) తన స్నేహితులతో కలిసి కారులో దర్శికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. గ్రామ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి గోతిలోకి బోల్తాపడింది. ఆ సమయంలో శేఖర్‌నాయక్ కారు నడుపుతున్నాడు. స్టీరింగ్ అతనికి బలంగా గుచ్చుకోవ డంతో అక్కడిక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున ఇరువురి స్నేహితులకు ఎలాంటి గాయాలు కాలేదు. శేఖర్ ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా అర్ధంతరంగా మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంతో మునిగిపోయింది.