చీరాలలో మెగా లోక్ అదాలత్
ABN , First Publish Date - 2020-02-08T23:14:25+05:30 IST
ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని కేసులు మెగా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారానికి నోచుకున్నాయని న్యాయమూర్తి కృష్ణన్ కుట్టి అన్నారు.

ప్రకాశం : ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని కేసులు మెగా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారానికి నోచుకున్నాయని న్యాయమూర్తి కృష్ణన్ కుట్టి అన్నారు. మెగా లోక్ అదాలత్ లో వెలువరించిన తీర్పు అంతిమ తీర్పు కావడంతో మరే పై న్యాయస్థానాలకు అప్పీలుకి వెళ్లే అవకాశం లేదని అన్నారు. చీరాలలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కృష్ణన్ కుట్టి మాట్లాడుతూ... మెగా లోక్ అదాలత్ ప్రారంభించిన రోజు నుండి ఇప్పటివరకు మూడు వందల కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు.