ఉపాధ్యాయునికి కరోనా...ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు

ABN , First Publish Date - 2020-11-03T17:56:52+05:30 IST

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.

ఉపాధ్యాయునికి కరోనా...ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు

ఒంగోలు: ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. తాజాగా నవంబర్ 2 నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. ఇదే ప్రకాశం జిల్లాలోని ఓ స్కూళ్లో విద్యార్థుల తల్లిదండ్రలను భయాందోళనకు నెట్టేసింది. జిల్లాలోని హనుమంతునిపాడు మండలం గొల్లపల్లి స్కూల్‌లో ఓ ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో స్కూల్‌లోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అధికారులు హుటాహుటిన కరోనా టెస్టులు చేయిస్తున్నారు. ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2020-11-03T17:56:52+05:30 IST