-
-
Home » Andhra Pradesh » Prakasam » prakasam
-
ప్రకాశం: వ్యక్తిపై కత్తులతో దాడి
ABN , First Publish Date - 2020-12-10T15:26:42+05:30 IST
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు బస్టాండ్ సెంటర్‌లో హత్యాయత్నం కలకలం రేపుతోంది.

ఒంగోలు: ప్రకాశం జిల్లా పుల్లలచెరువు బస్టాండ్ సెంటర్‌లో హత్యాయత్నం కలకలం రేపుతోంది. ముద్దా లక్ష్మయ్యపై ఏడుగురు దుండగులు కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు విజయవాడ వాసులుగా గుర్తించారు. ఓ వివాహానికి వచ్చి మద్యం మత్తులో దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.