ప్రకాశం: రోడ్డుపై ఇరుక్కుపోయిన రెండు లారీలు
ABN , First Publish Date - 2020-12-04T15:12:11+05:30 IST
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల వద్ద అమరావతి - కడప రహదారిలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్డుపై రెండు లారీలు ఇరుక్కుపోయాయి.
ఒంగోలు: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల వద్ద అమరావతి - కడప రహదారిలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్డుపై రెండు లారీలు ఇరుక్కుపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రోడ్డుపై ఇరుక్కుపోయిన లారీలను అక్కడి నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టారు.