ప్రకాశం జిల్లాలో చిలకలేరు వాగు ఉధృతి

ABN , First Publish Date - 2020-11-27T13:14:05+05:30 IST

ప్రకాశం జిల్లాలో తుపాను ప్రభావంతో సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి.

ప్రకాశం జిల్లాలో చిలకలేరు వాగు ఉధృతి

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో తుపాను ప్రభావంతో సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. అటు అద్దంకి-ముండ్లమూరు మధ్య  చిలకలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగులుప్పాడు మండలం కొత్తకోట వద్ద నేల వాగు ఉప్పొంగింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

Read more