పోర్టుతో మారనున్న కందుకూరు ప్రాంత రూపు రేఖలు

ABN , First Publish Date - 2020-12-20T05:13:16+05:30 IST

రామాయపట్నం పోర్టు నిర్మాణంతో కందుకూరు నియోజకవర్గం రూపు రేఖలు మారిపోతాయని నెల్లూరు పార్లమెంటు సభ్యుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు.శనివారం మధ్యాహ్నం ఆయన కందుకూరు శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డితో కలిసి మండలంలోని తిమ్మారెడ్డిపాలెం, లింగసముద్రంలలో సచివాలయాల నూతన భవనాల ప్రారంభోత్సవాలు, లింగసముద్రంలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

పోర్టుతో మారనున్న కందుకూరు ప్రాంత రూపు రేఖలు
తిమ్మారెడ్డిపాలెంలో సచివాలయం నూతన భవన శిలాఫలకం ఆవిష్కరిస్తున్న నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి


 నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి

 

లింగసముద్రం, డిసెంబరు 19 : రామాయపట్నం పోర్టు నిర్మాణంతో కందుకూరు నియోజకవర్గం రూపు రేఖలు మారిపోతాయని నెల్లూరు పార్లమెంటు సభ్యుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు.శనివారం మధ్యాహ్నం ఆయన కందుకూరు శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డితో కలిసి మండలంలోని తిమ్మారెడ్డిపాలెం, లింగసముద్రంలలో సచివాలయాల నూతన భవనాల ప్రారంభోత్సవాలు, లింగసముద్రంలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు రాళ్లపాడు ప్రాజెక్టును సందర్శించారు.ఈ సందర్భంగా లింగసముద్రం సచివాలయం వద్ద జరిగిన బహిరంగ సభలో ఎంపీ ఆదాల మాట్లాడారు. రామాయపట్నం పోర్టు నిర్మాణంతో ఎగుమతులు, దిగుమతులతో పాటు, రక రకాల వ్యాపారాలు జరుగుతాయన్నారు. అలాగే పరిశ్రమలు వచ్చి సుమారు 20 నుంచి 30 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ సోమశిల ఉత్తర కాలువ వెడల్పుకు సీఎం రూ.600 కోట్లు మంజూరు చేశారని, మరో 15 రోజులలో టెండర్లు  పిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు పీఆర్‌ ఈఈ సుబ్రమణ్యం, డీఎస్పీ కె. శ్రీనివాసులు, డీఈ సాధిక్‌, డీఎల్పీవో భాస్కర్‌రెడ్డి, తహసీల్దార్‌ ఆర్‌. బ్రహ్మయ్య, ఎంపీడీవో కె మాలకొండయ్య, ఏఈ ఎం. నరసింగరావు, వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


 22 నుంచి పోర్టు భూముల సేకరణ 

              - ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి

 ఉలవపాడు : ఈ నెల 22 నుంచి రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల కోసం భూసేకరణ ప్రారంభమవుతుందని కందుకూరు శాసన సభ్యుడు మానుగుంట మహీధర్‌ రెడ్డి చెప్పారు.  ఉలవపాడులో శనివారం రెండు నూతన నిర్మాణ సచివాలయాల ప్రారంభోత్సవంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్‌ పక్కన నిర్మించిన సచివాలయం-3 వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత భవనాల నిర్మాణం కోసం కృషి చేస్తానని ఎంపీ ఆదాల చెప్పగా కరేడు నుంచి రామాయపట్నం మధ్యలో షిప్పింగ్‌ హార్బర్‌ నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-20T05:13:16+05:30 IST