స్కూళ్ల పునఃప్రారంభంపై సంశయం

ABN , First Publish Date - 2020-07-20T11:36:08+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో పాఠశాలలు పునఃప్రారంభించి విద్యార్థులకు నేరుగా ఉపాధ్యాయులు తరగతి గదిలో పాఠాలు బోధించే అ వకాశం

స్కూళ్ల పునఃప్రారంభంపై సంశయం

తరగతులపై అభిప్రాయ సేకరణ

ఎంఈవోలు క్షేత్రస్థాయిలో సమావేశాలు

టీవీ, ఆన్‌లైన్‌ పాఠాలకే మొగ్గు


ఒంగోలువిద్య, జూలై 19 : కరోనా వైరస్‌ నేపథ్యంలో పాఠశాలలు పునఃప్రారంభించి  విద్యార్థులకు నేరుగా ఉపాధ్యాయులు తరగతి గదిలో పాఠాలు బోధించే అ వకాశం లేకుండా పోయింది. రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో పాఠశాలలు ఎప్పటికి ప్రారంభ మౌతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మొదట ఆగస్టు 3 నుంచి అని, తరువాత సెప్టెంబరు 5 నుంచి ప్రారంభించాలని యోచిస్తోంది. ఇందుకోసం కేంద్రప్రభుత్వ అనుమతి కోసం పాఠశాల విద్యాశాఖ లేఖకూడా రాసింది. ఇలాంటి అనిశ్చితి పరిస్థితుల్లో వి ద్యార్థులు విలువైన సమయం నష్టపోకుండా ఉండేం దుకు వారికి ఆన్‌లైన్‌ తరగతులు, టీవీల ద్వారా పాఠా లు బోధిస్తున్నారు. టీవీ పాఠాలు కొనసాగింపు విషయ మై ప్రభుత్వం అభిప్రాయ సేకరణ చేపట్టింది.


ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు తది తరులు అభిప్రాయాలు సేకరించి పంపించాలని ప్రభు త్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎంఈవోలు క్షేత్ర స్థాయిలో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు డీ ఈవోకు తెలియజేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పా ఠశాలలు ప్రారంభించకుండా టీవీలు, ఆన్‌లైన్‌ పాఠాల కే పరిమితం కావాలని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా కరోనా తగ్గే వరకు తమ పిల్లలను స్కూళ్లకు పంపించేది లేదని తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు. దీంతో అందరూ ఆన్‌లైన్‌, టీవీ పా ఠాలకే మొగ్గు చూపుతున్నారు. 


Updated Date - 2020-07-20T11:36:08+05:30 IST