పోస్టింగ్‌లపై పోలీసుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2020-07-19T19:13:52+05:30 IST

‘సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లపై పోలీ సులు అత్యుత్సాహం చూపుతున్నారు..

పోస్టింగ్‌లపై పోలీసుల అత్యుత్సాహం

వైసీపీకి కొమ్ముకాస్తూ టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు

హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం

కొండపి ఎమ్మెల్యే స్వామి 

స్టేషన్లు మార్చి మార్చి కొట్టారు : బాధితుడు సందీప్‌ 


ఒంగోలు: ‘సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లపై పోలీ సులు అత్యుత్సాహం చూపుతున్నారు. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడు తున్నారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు’ అని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా బాలవీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. వీరి వ్యవహార శైలిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.  శనివారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాల యలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన డబ్బు తమిళనాడులో పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోలు సామా జిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయన్నారు. అయితే  కేవలం తమకు వచ్చిన వీడియోలను వేరే వారికి  పోస్టు చేసినందుకు టీడీపీ కార్యకర్తలు వడ్డెళ్ల సందీప్‌, చంద్రశేఖర్‌రావులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు.


వారిని మూడు  స్టేషన్లకు తిప్పి, అమానుషంగా కొట్టడంతోపాటు, ఎలాంటి ఆధారాలు లేని వాటిని కారణంగా చూపి కేసులు నమోదు చేశారన్నారు. బాధితులను న్యాయం చేయా ల్సిన పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ టీడీపీ శ్రేణులను భయపెట్టే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. 2019లో రైతు సదస్సులో తనపై కొందరు దౌర్జ న్యం చేయగా, తాను ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగిందన్నారు. దాని గు రించి ఇంతవరకు పట్టించుకోని పోలీసులు ఇప్పుడు టీడీపీ కార్యకర్తలను వేధిస్తూ అత్యుత్సాహం చూపుతున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలను కొట్టిన పోలీసులను ఉన్నతాధికారులు వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 


ఇదిలా ఉండగా పోలీసులు అరెస్టు చేసిన సందీప్‌, చంద్రశేఖర్‌ను శనివారం ఒంగోలులోని కోర్టుకు హాజరుపర్చగా న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. అక్కడి నుంచి వారు నేరుగా విలేకరుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సంద ర్భంగా సందీప్‌ మాట్లాడుతూ తనను గురువారం ఉదయం 11గంటలకు పోలీసు లు అదుపులోకి తీసుకుని ఒంగోలు ఒన్‌టౌన్‌,  తాలూకా పోలీసు స్టేషన్లకు మార్చి, మార్చి కొట్టారని, శుక్రవారం రాత్రి 11 గంటలకు అరెస్టు చూపించారని వాపో యారు. తన కాలు ఆపరేషన్‌ జరిగిందని చెప్పినా వినిపించుకోకుండా కొట్టడమే కాక, మరికొందరు పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ యువ నాయకుడు దామచర్ల సత్య,  డాక్టర్‌ గుర్రాల రాజ్‌విమల్‌, కొఠారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, బండారు మధన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-07-19T19:13:52+05:30 IST