-
-
Home » Andhra Pradesh » Prakasam » police officers should lern enquiry on cyber crime
-
సైబర్ నేరాల విచారణపై అవగాహన పెంచుకోవాలి
ABN , First Publish Date - 2020-12-28T06:01:56+05:30 IST
సైబర్ నేరాల విచారణలో పోలీసు అధి కారులు అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ సిద్థార్ధకౌశల్ పిలుపుని చ్చారు. ఆదివారం ఒంగోలులోని పోలీస్ కల్యాణ మండపంలో పోలీసు అధి కారులకు అవగాహన సదస్సు జరిగింది.

ఎస్పీ సిద్థార్ధకౌశల్ పిలుపు
ఒంగోలు(క్రైం), డిసెంబరు 27: సైబర్ నేరాల విచారణలో పోలీసు అధి కారులు అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ సిద్థార్ధకౌశల్ పిలుపుని చ్చారు. ఆదివారం ఒంగోలులోని పోలీస్ కల్యాణ మండపంలో పోలీసు అధి కారులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ సైబర్ నేరాలను విచారించడంలో ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకో వాలని, తద్వారా భాదితులకు న్యాయం చేయగలమని చెప్పారు. అలాగే గ్రా మాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. సైబర్‌క్రైం నిపు ణులు యు.రామ్మోహన్‌రావు, హోంగార్డ్సు కమాండెంట్ పాడిబండ్ల ప్రసాద్ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎస్పీ బి.రవిచంద్ర, ఓఎస్‌డీ కె.చౌడే శ్వరి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ వి.సూర్యనారాయణ, మహిళ కమిషన్ సభ్యురాలు టి. రమాదేవి తదితరులు పాల్గొన్నారు.