గొర్రెల పెంపకందారులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-12-01T05:30:00+05:30 IST

నివర్‌ తుఫాన్‌ కార ణంగా నష్టపోయిన గొర్రెలు, మేకల పెంపకందారులను ఆదుకో వాలని సంఘ పశ్చిమ ప్రకాశం కమిటీ నేతలు కోరారు.

గొర్రెల పెంపకందారులను ఆదుకోవాలి
డీడీకి వినతిపత్రం ఇస్తున్న గొర్రెల, మేకల పెంపకందారులు


మార్కాపురం (వన్‌టౌన్‌), డిసెంబరు 1 : నివర్‌ తుఫాన్‌ కార ణంగా నష్టపోయిన గొర్రెలు, మేకల పెంపకందారులను ఆదుకో వాలని సంఘ పశ్చిమ ప్రకాశం కమిటీ నేతలు కోరారు. ఈమేరకు పశుసంవర్థక శాఖ డీడీ మహేశ్వరుడికి మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గొర్రెల, మేకల పెంపకందార్ల సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి టి.తిరుపతిరావు మాట్లాడుతూ తు ఫాన్‌ కారణంగా వందలాది గొర్రెలు మృత్యువాతపడ్డాయన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో గొర్రెకు రూ.10వేల పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు గంగరాజు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-01T05:30:00+05:30 IST