భౌతిక..దూరమే!
ABN , First Publish Date - 2020-07-27T11:01:20+05:30 IST
ఎర్రగొండపాలెంలో కరోనా పాజిటివ్‌లు పెరగడంతో ఈనెల 22వ తేదీ నుంచి లాక్‌డౌన్ ప్రకటించారు

ఎర్రగొండపాలెం :
ఎర్రగొండపాలెంలో కరోనా పాజిటివ్‌లు పెరగడంతో ఈనెల 22వ తేదీ నుంచి లాక్‌డౌన్ ప్రకటించారు. అయితే స్థానిక పుల్లలచెరువు రోడ్డులోని మద్యం దుకాణం వద్ద మాత్రం భౌతిక దూరం కనిపించడం లేదు. మందుబాబులు గుంపులుగా మద్యం కోసం ఎగబడడంతో భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.