పట్టుపురుగుల పెంపకంలో మెలకువలు పాటించాలి

ABN , First Publish Date - 2020-12-15T06:22:06+05:30 IST

ట్టుపురుగుల పెంపకంలో రైతులు మెలకువలు వాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని కడప జిల్లా రాయచోటి కేంద్ర పట్టుమండలి శాస్త్రవేత్త డాక్టర్‌ ఏ.వేణుగోపాల్‌ అన్నారు.

పట్టుపురుగుల పెంపకంలో  మెలకువలు పాటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న శాస్త్రవేత్త డాక్టర్‌ వేణుగోపాల్‌

 రాయచోటి కేంద్ర పట్టుమండలి శాస్త్రవేత్త డాక్టర్‌ వేణుగోపాల్‌


గిద్దలూరు టౌన్‌, డిసెంబరు 14 : పట్టుపురుగుల పెంపకంలో రైతులు మెలకువలు వాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని కడప జిల్లా రాయచోటి కేంద్ర పట్టుమండలి శాస్త్రవేత్త డాక్టర్‌ ఏ.వేణుగోపాల్‌ అన్నారు. సోమవారం గిద్దలూరులోని పట్టుపరిశ్రమ కేంద్రంలో పట్టు రైతులకు పంటపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ మల్బరీ వ్యవసాయం, పట్టుపురుగుల పెంపకం గురించి రైతులకు వివరించారు. సకాలంలో రేడింగ్‌ షెడ్‌లో బ్లీచింగ్‌, సెరిఫిట్‌, అసరా మందులను పిచికారి చేయడం వలన రోగక్రిములను నాశనం చేసి మంచి దిగుబడి పొందవచ్చన్నారు. సమావేశంలో సిరికల్చర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రామారావు, సిరికల్చర్‌ అధికారి బాలసుబ్రమణ్యం, స్థానిక టెక్నికల్‌ ఆఫీసర్‌ పాండురంగస్వామి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-15T06:22:06+05:30 IST