పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు

ABN , First Publish Date - 2020-12-26T05:43:57+05:30 IST

పార్టీ కోసం పనిచేసే వారిని అధిష్ఠా నం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పేర్కొన్నారు. శుక్రవారం కొత్తపట్నం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు.

పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు
నాయకులతో మాట్లాడుతున్న దామచర్ల జనార్దన్‌

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల 


కొత్తపట్నం, డిసెంబరు 25: పార్టీ కోసం పనిచేసే వారిని అధిష్ఠా నం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పేర్కొన్నారు. శుక్రవారం కొత్తపట్నం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు. కొత్తపట్నంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ కార్యాలయంలో నాయకుల తో మాట్లాడారు. రంగాయపాలెంలో పర్యటించి ఇటీవల మృతిచెందిన వాటంబేటి సుబ్బరామిరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. పల్లెపాలెం, పాదర్తి, రాజుపాలెం గ్రామాల్లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడి దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ శ్రీనివాసరావు,  జిల్లా నాయకులు గేనం సుబ్బారావు, మండల అధ్య క్షుడు బలగాని వెంకటేశ్వరరావు,  మేడా సుబ్బారావు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-26T05:43:57+05:30 IST