ఇంటర్‌ మూల్యాంకనం వాయిదా

ABN , First Publish Date - 2020-03-21T07:42:49+05:30 IST

కరోనా వైరస్‌ దెబ్బ ఇంటర్మీడియట్‌ పరీక్షా పత్రాల మూల్యాంకనంపైనా పడింది. ఆ వైరస్‌ నివారణకు ప్రభుత్వం చేపట్టిన ముందుజాగ్రత్త చర్యల్లో...

ఇంటర్‌ మూల్యాంకనం వాయిదా

ఒంగోలువిద్య, మార్చి 20 : కరోనా వైరస్‌ దెబ్బ ఇంటర్మీడియట్‌ పరీక్షా పత్రాల మూల్యాంకనంపైనా పడింది. ఆ వైరస్‌ నివారణకు ప్రభుత్వం చేపట్టిన ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నెల 19 నుంచి ప్రారంభమైన పరీక్షా పత్రాల మూల్యాంకనం మొదటి స్పెల్‌ను ఈ నెల 31వ తేదీ వరకు వాయిదా వేస్తూ ఇంటర్మీడియట్‌ బోర్డు కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆర్‌ఐవో వి.వి. సుబ్బారావు చెప్పారు. రాష్ట్రంలో ప్రబలుతున్న కరోనా వైరస్‌ -19 కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మూల్యాంకనాన్ని ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు రద్దు చేసినట్లు చెప్పారు. మూల్యాంకనం పునఃప్రారంభించే తేదీలను తరువాత ప్రకటిస్తామన్నారు.

Updated Date - 2020-03-21T07:42:49+05:30 IST