ఒంగోలు కార్పొరేషన్‌ కమిషనర్‌గా భాగ్యలక్ష్మి

ABN , First Publish Date - 2020-10-27T18:06:56+05:30 IST

ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్‌గా కె. భాగ్య లక్ష్మి నియమితులయ్యా రు. ఇప్పటి వరకూ ఇక్క డ పనిచేస్తున్న పి. నిరం జన్‌రెడ్డి..

ఒంగోలు కార్పొరేషన్‌ కమిషనర్‌గా భాగ్యలక్ష్మి

నిరంజన్‌రెడ్డి బదిలీ 


ఒంగోలు: ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్‌గా కె. భాగ్య లక్ష్మి నియమితులయ్యా రు. ఇప్పటి వరకూ ఇక్క డ పనిచేస్తున్న పి. నిరం జన్‌రెడ్డి బదిలీ అయ్యా రు. ఈమేరకు సోమవారం ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. నూతన కమిషనర్‌గా నియమితులైన భాగ్యలక్ష్మి ప్రస్తుతం గుంటూరులో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పని చేస్తున్నారు.  గతంలో రాష్ట్రంలోని వివిధ మునిసిపాలిటీలలో గ్రేడ్‌-1  కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ఆమె స్పెషల్‌ గ్రేడ్‌ మునిసిపల్‌ కమిషనర్‌గా ఉద్యోగోన్నతి పొందారు. బదిలీ అ యిన నిరంజన్‌రెడ్డి గత ఏడాది జూలై 17న ఒంగోలు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పదహారు నెలలు పనిచేశారు. అతి తక్కువ సమయం లోనే బదిలీ కావడం చర్చనీయంశంగా మారింది. ఆయన్ను డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మిస్ట్రేషన్‌కు రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


Updated Date - 2020-10-27T18:06:56+05:30 IST