మహిళా కానిస్టేబుల్‌కు ఎస్‌ఐ వేధింపులు
ABN , First Publish Date - 2020-10-03T16:22:34+05:30 IST
ప్రకాశం జిల్లా ఒంగోలు తాలుకా పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్ పట్ల ఎస్‌ఐ అసభ్యరీతిలో ప్రవర్తించాడు.

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు తాలుకా పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్ పట్ల ఎస్‌ఐ అసభ్యరీతిలో ప్రవర్తించాడు. డబుల్ మీనింగ్ డైలాగులతో మహిళా కానిస్టేబుల్‌ను వేధించాడు. నెల రోజుల క్రితమే ఎస్సై బదిలీపై తాలూకా స్టేషన్‌కు వచ్చాడు. లోపల ఏం జరుగుతుందో కనిపించకుండా ఛాంబర్‌కు కర్టెన్లు వేయించాడు. మహిళా కానిస్టేబుల్‌ను తన ఛాంబర్‌కు పిలిచి అసభ్యకరంగా ప్రవర్తిసూ తీవ్రంగా బాధపెట్టాడు. వేధింపులు ఎక్కువవడంతో ఎస్‌ఐ ప్రవర్తనపై ఉన్నతాధికారులకు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ విచారణ చేపట్టారు.